సేంద్రియ సాగుపై మొగ్గు చూపాలి
రేగొండ : రైతులు సేంద్రియ సాగుకు మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయఽ అధికారి విజయభాస్కర్ అన్నారు. ప్రపంచ మృత్తిక దినోత్సవాన్ని గురువారం మండలకేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా విజయభాస్కర్ మాట్లాడుతూ వ్యవసాయంలో రసాయనాల వినియోగం ఎక్కువై పంట ఉత్పత్తుల ద్వారా ఆహారంలోకి చేరి మానవాళి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందన్నారు. రైతులు అవలంభిస్తున్న సాగు విధానాలతో భూసారం క్షీణిస్తోందని చెప్పారు. నేల సహజ స్వభావాన్ని కోల్పోతుందన్నారు. రాబోయే తరాలకు ఆహారాన్ని అందించడానికి ఆరోగ్యకరమైన నేలను అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు రమేష్, మండల వ్యవసాయ అధికారి వాసుదేవ రెడ్డి, కోరమాండల్ కంపెనీ ప్రతినిధి సుమన్, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment