కాళేశ్వరం: భూతగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసిన ఘటన గురువారం రాత్రి మహదేవపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మహదేవపూర్ మండల కేంద్రంలో కొన్నేళ్లుగా ఇరు కుటుంబాల మధ్య భూతగాదాలు జరుగుతున్నాయి. సుంకె మహేష్‌పై అతని ఽఽబంధువు జంగేడు రాజయ్య గొడ్డలితో దాడి చేశాడు. మహేష్ తలకు బలమైన గాయం అయింది. దీంతో చాలా రక్తస్రావం జరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు మహదేవపూర్ ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. మహేష్ తల్లి ఈశ్వరమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment