హమాలీ డబ్బులు అందేనా?
ములుగు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించిన రైతులకు హమాలీ చార్జీలను చెల్లించడంలో జాప్యం చేస్తోంది. గడిచిన ఐదేళ్లుగా హమాలీ డబ్బుల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తూకం వేసే హమాలీలు రైతుల నుంచి ముందస్తుగా హమాలీ చార్జీలను వసూలు చేసి తూకం వేస్తున్నారు. క్వింటాకు రైతుల నుంచి హమాలీలు రూ. 50నుంచి 55 తీసుకుంటున్నారు. కొనుగోలు కేంద్రాలలో అమ్మకాలు చేపట్టిన రైతులకు 5రూపాయల 10పైసలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అయినప్పటికీ ఐదు సంవత్సరాలుగా హమాలీల డబ్బులు చెల్లించకపోవడంతో రైతులపై అదనపు భారం పడుతోంది.
1.63లక్షల ఎకరాల్లో వరిపంట సాగు
జిల్లాలోని తొమ్మిది మండలాల పరిధిలో వరిసాగు రైతులు 52,348 మంది ఉన్నారు. 1.63లక్షల ఎకరాల్లో వరిపంట సాగు చేస్తున్నారు. ప్రతిఏటా ఖరీఫ్, రబీ సాగులో దాదాపుగా 2,70,344 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లయీస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ధాన్యం సేకరణ చేపడుతోంది.
2019నుంచి హమాలీ చార్జీల నిలిపివేత
రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తూకం వేయడం, వాహనాల్లో లోడింగ్ చేయడానికి రైతులు హమాలీలకు ముందస్తుగా డబ్బులు చెల్లిస్తారు. రైతులపై హమాలీ డబ్బులు భారం పడకుండా ప్రభుత్వం క్వింటాకు రూ. 5.10 హమాలీ డబ్బులను విడుదల చేసేది. నిర్వాహకులు రైతులకు హమాలీ డబ్బులను చెల్లించేవారు. 2019–20 నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం హమాలీ డబ్బుల చెల్లింపులు నిలిపి వేసింది. దీంతో రైతులపై అదనపు భారం పడుతుంది.
పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో సేకరణ
ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో గిరిజన, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మహిళా సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులు సాగుచేసిన ధాన్యాన్ని సేకరిస్తోంది. ధాన్యం సేకరణకు జిల్లా వ్యాప్తంగా సుమారుగా 204 కేంద్రాలకు ప్రతిపాదనలు రాగా పీఏసీఎస్ ఆధ్వర్యంలో 135 కేంద్రాలు, జీసీసీ ఆధ్వర్యంలో 24 కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 37 కేంద్రాలు, రైతుమిత్ర సంఘాల ఆధ్వర్యంలో 8 కేంద్రాలను కేటాయించారు.
ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న హమాలీల డబ్బుల వివరాలు
సంవత్సరం ధాన్యం సేకరణ హమాలీ
మెట్రిక్ టన్నులు డబ్బులు
ఖరీఫ్ 2019–20 1,65,167 రూ.84,23,517
రబీ 1,05,177 రూ.53,64,027
ఖరీప్ 2020–21 1,10,153 రూ.56,17,803
రబీ 1,00,404 రూ.51,20,604
ఖరీప్ 2021–22 1,40,473 రూ.71,64,123
రబీ 34,218 రూ.17,45,118
ఖరీప్2022–23 1,29,698 రూ.66,14,598
రబీ 67,916.640 రూ.36,33,540
ఖరీప్.2023–24 1,01,188.000 రూ.54,13,558
రూ.4,43,051 పెండింగ్
2019 నుంచి చెల్లింపుల్లో జాప్యం
రైతులపై అదనపు భారం
Comments
Please login to add a commentAdd a comment