కేటీఆర్‌పై అక్రమ కేసులు ఎత్తేయాలి
భూపాలపల్లి రూరల్: బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్‌పై ఏసీబీ పెట్టిన అక్రమ కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో బీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టాయి. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరై మాట్లాడారు. హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి నగరాల జాబితాలో చేర్చిన ఘనత కేటీఆర్‌దని అన్నారు. ఈ కార్ రేసు ద్వారా హైదరాబాద్ ఇమేజ్ అంతర్జాతీయ స్థాయికి పెరిగిందని గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణకు గ్రాండ్ ఇమేజ్‌తో పాటు ఆర్థికపరంగా రూ.700 కోట్ల రూపాయలు లాభం వచ్చిందని తెలిపారు. ధర్నా ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు పార్టీ నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, టీబీజీకేఎస్ నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే
గండ్ర వెంకటరమణారెడ్డి
ఉద్రిక్తంగా మారిన ధర్నా
Comments
Please login to add a commentAdd a comment