క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ పోటీలు
భూపాలపల్లి రూరల్: గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సీఎం కప్ పోటీలు నిర్వహిస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో అంబేడ్కర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాశ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు, మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతీ జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రాల్లో స్టేడియాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నేషనల్, ఇంటర్నేషన్‌లో ఆడేవిధంగా జిల్లా నుంచి క్రీడాకారులు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడా శాఖ అధికారి చిర్ర రఘు, జిల్లా విద్యాశాఖాధికారి రాజేందర్, వివిధ క్రీడా విభాగాల అధ్యక్షులు, కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, నాయకులు బుర్ర కొమురయ్య, పిప్పాల రాజేందర్, అంబాల శ్రీనివాస్, అప్పం కిషన్ పాల్గొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
భూపాలపల్లి టౌన్, భూపాలపల్లి రూరల్, గణపురం, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన 183మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు రూ.53 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే సత్యనారాయణరావు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఖండించారు. అమిత్‌షా వెంటనే అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీసీసీ సభ్యులు మధు, భూపాలపల్లి మండల పార్టీ అధ్యక్షుడు సుంకరి రామచంద్రయ్య, జిల్లా పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు
Comments
Please login to add a commentAdd a comment