వెంకటస్వామి గొప్ప రాజకీయవేత్త
భూపాలపల్లి రూరల్: కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ వెంకటస్వామి గొప్ప రాజకీయ వేత్త అని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. ఐడీఓసీ కార్యాలయంలో ఆదివారం వెంకటస్వామి వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అశోక్‌కుమార్ పాల్గొని వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెంకటస్వామి వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం ‘స్టేట్ ఫంక్షన్’గా నిర్వహించాలని ఉత్తర్వులు జారీచేసినట్లు పేర్కొన్నారు. వెంకటస్వామి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటు పడ్డారని చెప్పారు. సామాజిక సమానత్వం కోసం సాగించిన ఉద్యమాలు, శ్రామిక వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి అభినందనీయమన్నారు. తాను చేపట్టిన పదవులకు వన్నెతెచ్చిన గొప్ప రాజకీయవేత్త అని ఆయన సేవలను కొనియాడారు. ఆయన సేవలను గుర్తిస్తూ నిరంతరం స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి, వర్ధంతి నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
Comments
Please login to add a commentAdd a comment