కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలోని కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాలలోని ఐసెట్ కార్యాలయానికి రిజిస్ట్రార్ ఆచార్య పి.మల్లారెడ్డి తాళం వేసి సీల్ చేశారు. 12 ఏళ్లుగా కాకతీయ యూనివర్సిటీయే టీఎస్‌ఐసెట్ నిర్వహించిన నేపథ్యంలో ఆ కళాశాలలో ప్రత్యేకంగా ఒక హాల్‌ను కార్యాలయంగా ఏర్పాటుచేసి అవసరమైన ఫర్నిచర్, టేబుళ్లు, కంప్యూటర్లు తదితర సామగ్రిని సమకూర్చారు. ఈసారి ఐసెట్ నిర్వహణను ఉన్నత విద్యామండలి కేయూకు అప్పగించకపోవడంతో ఐసెట్ కార్యాలయం నిరుపయోగంగా మారింది. ఈ కార్యాలయం నుంచి రెండు చైర్లు ఎవరో బయటికి తీసుకెళ్లారని ఆరోపిస్తూ రెండురోజుల క్రితం ఒకరు రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లారని సమాచారం. దీంతో ఆయన కళాశాలను సందర్శించి ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడ స్టాక్ రిజిస్టర్ మెయింటేన్ చేయటంలేదనేది గుర్తించిన రిజిస్ట్రార్.. ప్రస్తుతం ఉన్న ఫర్నిచర్ రిజిస్టర్‌లో పొందుపరిచి కార్యాలయానికి తాళం వేయించారు. అందులోని వస్తువుల జాబితా పత్రాన్ని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అమరవేణికి అందజేసినట్లు ఆదివారం వెల్లడించారు.
పాలాభిషేకం
ములుగు: నిరుద్యోగ కళాకారులను ఆదుకుంటామని శాసనమండలిలో టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్ ప్రస్తావించారు. ఈ విషయంపై సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆదివారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆయన చిత్రపటానికి నిరుద్యోగ కళాకారులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు మోతె రమేష్ మాట్లాడుతూ నిరుద్యోగ కళాకారులను గత ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment