విద్య, వైద్యానికి మొదటి ప్రాధాన్యం
భూపాలపల్లి రూరల్/చిట్యాల/మొగుళ్లపల్లి/టేకుమట్ల/ రేగొండ: విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతనిస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని జంగేడు కేజీబీవీలో విద్యార్థినులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేశారు. జంగేడు కెజీబీవీలో కలెక్టర్ రాహుల్ శర్మ, విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. చలి తీవ్రత నేపథ్యంలో హాస్టల్ విద్యార్థుల కోసం గీజర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని సంక్షేమ, మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేస్తున్నామన్నారు. జంగేడు పాఠశాల చుట్టుపక్కల బెల్ట్ షాపులు ఉన్నాయని, వాటి వల్ల విద్యార్థులకు ఇబ్బందిగా ఉంద ని తెలుపగా తక్షణమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. విద్యార్థులు చెప్పిన అన్ని సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్, కస్తూరిబా గాంధీ పాఠశాలలో శనివారం కలెక్టర్ రాహుల్ శర్మ, భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు దుప్పట్లు పంపిణీ చేసి మాట్లాడారు. కొరికిశాల మోడల్ స్కూల్‌లో విద్యార్థులకు ఎమ్మెల్యే.. బ్లాంకెట్స్, బెడ్ షీట్స్ పంపిణీ చేశారు. హాస్టల్‌లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకొచ్చిన 24 గంటల్లో పరిష్కరిస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఉపాధ్యాయుల శిక్షణతో తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, మండలాల ప్రత్యేక అధికారులు సునిత, శైల జ, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శైలజ, తహసీల్దార్లు, హేమ, సునీత, విజయలక్ష్మి, ఎంపీడీఓలు జయశ్రీ,, హుస్సేన్, అనిత, వెంకటేశ్వరరావు, ఎంపీఓ సురేశ్, ఎంఈఓ రఘుపతి,ఆర్‌ఐ సంతోష్‌బాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు సతీశ్‌గౌడ్, తిరుపతిరెడ్డి, రామారావు, స్వామిరావు, సంపత్, రఫీ, నర్సింగరావు, కిష్టయ్య, వెంకటేశ్వరరావు, గుమ్మడి శ్రీదేవిసత్యం, తిరుపతి, సమ్మ య్య, తిరుపతిరెడ్డి, మధువంశీకృష్ణ, కేజీబీవీ ఎస్‌ఓ మనోరమ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment