ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి
రేగొండ: ధాన్యం కొనుగోళ్లలో వేగంపెంచి త్వరగా పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. మండలంలోని దమ్మన్నపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఆయన పరిశీలించి, మాట్లాడారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియతోపాటు, ట్యాబ్ ఎంట్రీలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు ధాన్యాన్ని సజావుగా విక్రయించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించామని, కొనుగోలు ప్రక్రియలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాథ్, సహకార అధికారి వాలియానాయక్ తదితరులు పాల్గొన్నారు.
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
భూపాలపల్లి రూరల్: నేడు(ఆదివారం) 11కేవీ విద్యుత్ రాంనగర్ ఫీడర్‌పై మరమత్తు చేయనున్న నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలో విద్యుత్ అంతరాయం ఉంటుందని భూపాలపల్లి విద్యుత్ శాఖ ఏఈ అవినాశ్‌రెడ్డి శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. మున్సిపల్ పరిధిలోని రెడ్డి కాలనీ, ఎల్‌బీనగర్, బస్టాండ్ రోడ్, సుభాశ్ కాలనీ, రాంనగర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో ఉదయం 8గంటల నుంచి 12గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
‘ఓపెన్’ పరీక్ష ఫీజు
చెల్లింపునకు అవకాశం
భూపాలపల్లి అర్బన్: ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజును ఈ నెల 22వ తేదీ లోపు ఎటువంటి అపరాధ రుసుం లేకుండా చెల్లించాలని జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్ శనివారం ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్, మే మాసంలో ఓపెన్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులు రూ.25 అపరాధ రుసుంతో ఈనెల 29వ తేదీ వరకు, రూ.50 అపరాధ రుసుంతో ఫిబ్రవరి 3వ తేదీ వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
8న సదరం క్యాంపు
భూపాలపల్లి రూరల్: జిల్లాలోని పలు మండలాలతోపాటు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని దివ్యాంగుల కోసం ఈనెల 8వ తేదీ బుధవారం జిల్లా కేంద్రంలోని 100 పడకల ఆస్పత్రిలో సదరం క్యాంపును నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఓ నరేశ్ శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. శారీరక, వినికిడి, మానసిక, కంటిచూపు లోపంగల దివ్యాంగులతోపాటు రెన్యూవెల్ చేసుకునేవారు మీసేవ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. క్యాంపులు నిర్వహించే రెండు రోజుల ముందు బుకింగ్ అవకాశం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. స్లాట్ బుక్ చేసుకున్నవారే క్యాంపులకు హజరు కావా లని, గతంలో తిరస్కరణకు గురైనవారికి అవకాశం లేదని డీఆర్‌డీఓ నరేశ్ స్పష్టం చేశారు.
రాష్ట్రస్థాయికి విద్యార్థిని ఎంపిక
చిట్యాల: మండలంలోని జూకల్ ఉన్నత పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థిని కోరాండ్ల సిరిచందన జిల్లా స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్‌లో ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరగాని కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం సిరిచందనను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రూపశ్రీ, మమత, రఫీ, ఉమాదేవి, రూప, రంజిత్‌కుమార్, రవీందర్, శ్రీనివాస్, చారి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
‘వసూళ్ల’పై విచారణ
కాటారం: మహాముత్తారం మండలం దౌతుపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో భాగంగా వసూళ్లకు పాల్పడిన ఘటనపై మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్లు శనివారం విచారణ చేపట్టారు. డబ్బులు చెల్లించినట్లు ఫిర్యాదు చేసిన పదిమంది మహిళల నుంచి వివరాలు సేకరించారు. నివేదికను కలెక్టర్‌కు అందించనున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment