మహిళా శక్తి పథకంతో ఆర్థికాభివృద్ధి
భూపాలపల్లి: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకంతో మహిళలు ఆర్థికాభివృద్ధి సాధిస్తారని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. ఈ పథకం ద్వారా సంచార చేపల విక్రయాలు చేపట్టనున్నట్లు తెలిపారు. శనివారం ఐడీఓసీ కార్యాలయంలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో సంచార వాహనాన్ని మహిళాశక్తి సంఘాలకు అందజేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా చేపల విక్రయానికి రూ.10 లక్షల విలువ గల సంచార చేపల విక్రయ వాహనం మంజూరు చేసినట్లు తెలిపారు. మత్స్యశాఖ అధికారి అవినాశ్, డీఆర్‌డీఓ నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
ప్రతీ ఒక్కరు రహదారి భద్రతా నియమాలు పాటించాలని కలెక్టర్ రాహుల్ శర్మ సూచించా రు. హైదరాబాద్ నుంచి రవాణా శాఖ ప్రత్యేక కార్యదర్శి వికాస్‌రాజ్‌తో కలిసి రోడ్డు భద్రతా ప్రమాణాలు, మాసోత్సవాల నిర్వహణ తదిత ర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో శనివా రం రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. జనవరి నెల మొత్తం రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించా లని ఆదేశించారు. నిరంతరం తనిఖీలు చేయాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, డీటీఓ సంధాని పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలు చిన్నారుల శారీరక, మానసిక అభివృద్ధికి దోహదం చేస్తాయని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కేంద్రాలకు పూర్వ ప్రాథమిక విద్యా పరికరాలు అంగన్ ప్రీ స్కూల్ పిల్లలకు ఏకరూప దుస్తులను శనివారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే, కలెక్టర్ పంపిణీ చేశారు. లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీడబ్ల్యూఓ చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ
Comments
Please login to add a commentAdd a comment