అమరచింత పట్టువస్త్రాలు
కురుమూర్తిరాయుడికి..
అమరచింత: భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కురుమూర్తి రాయుడికి అమరచింత పట్టువస్త్రాలు సమర్పించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పక్షం రోజుల క్రితం పద్మశాలి కులస్తులు స్థానిక మార్కండేయస్వామి ఆలయంలో పట్టువస్త్రాల తయారీని ప్రారంభించారు. ఈ నెల 6న స్వామివారి అలంకారోత్సవం సందర్భంగా పట్టువస్త్రాలను సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అమరచింత నుంచి పట్టువస్త్రాలను తలపై పెట్టుకొని కురుమూర్తిస్వామి ఆలయానికి తీసుకెళ్లేందుకు గాను ముగ్గురు కుల బంధువులను లక్కీడిప్ ద్వారా ఎంపిక చేయనున్నారు. వారితో స్వామివారి సన్నిధి వరకు భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా పట్టువస్త్రాలను తీసుకెళ్లి సమర్పించనున్నారు.
ఇలవేల్పుకు పట్టు కానుక..
అమరచింత పద్మశాలి కులస్తుల ఇలవేల్పు కురుమూర్తి రాయుడికి ఎన్నో ఏళ్లుగా పట్టువస్త్రాలు సమర్పిస్తూ వస్తున్నారు. గతంలో నూలుతో నేసిన వస్త్రాలను అందించే వారు. ప్రస్తుతం పట్టు అందుబాటులోకి రావడంతో స్వామివారికి పంచె, గౌను, అమ్మవారికి పట్టుచీరను స్వయంగా ప్రత్యేక మగ్గంపై నేసి సమర్పిస్తున్నారు.
గతంలో స్వామివారి
పుష్కరిణిలోనే..
అరవై ఏళ్ల క్రితం అమరచింత పద్మశాలి కులస్తులు స్వామివారి పుష్కరిణిలో నీటిపై తేలాడే డ్రమ్ములపై ప్రత్యేకంగా మగ్గం ఏర్పాటుచేసి.. అక్కడే స్వామి, అమ్మవార్లకు వస్త్రాలను తయారు చేసే వారు. అప్పట్లో కోటకొండ కుర్మన్న, కొంగరి చిన్నయ్య, నరాల సింగోటం కోనేటిలోనే స్వామి వారికి వస్త్రాలను నేసి, భక్తిశ్రద్ధలతో స్వామి వారికి సమర్పించే వారు.
పక్షం రోజులు కొనసాగిన
వస్త్రాల తయారీ
6న కురుమూర్తి ఆలయానికి ఊరేగింపుగా తరలింపు
Comments
Please login to add a commentAdd a comment