నిబంధనలకు విరుద్ధంగా..
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాది కొత్త గూడెం జిల్లాలోని పలు ఇసుక రిచ్‌ల నుంచి గద్వాల జిల్లాకు ఇసుకను ప్రభుత్వ అనుమతులతో వ్యాపారులు ఇసుకను తీసుకువస్తున్నారు. అయితే పోలీసుల తనిఖీలో మాత్రం సామర్థ్యానికి మించి ఇసుక లారీలలో రావడంతో అధికారులు అవాక్కవుతున్నారు. సాధారణంగా 26 టన్నుల ఇసుక ఉండాల్సిన క్రమంలో 39 టన్నుల ఇసుకను చేరవేయడం గుర్తించిన పోలీసులు తనిఖీలు చేయడంతో దందా వెలుగులోకి వచ్చింది. దీంతో అక్రమార్కులపై కేసులు నమోదు చేశారు. అయితే, చాలామటుకు ఇసుక వ్యాపారస్తులు, ఆయా శాఖల అధికారుల మధ్య నెలకొన్న చీకటి ఒప్పందాల మేరకు సామర్థ్యానికి మించి ఇసుకను తరలిస్తున్నా.. వాటిని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment