రేవంత్‌రెడ్డి వరంగల్‌లో సోనియాగాంధీని దేవతన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు సోనియాగాంధీని బలిదేవత అన్నారు. ఏ ఎండకు ఆ గొడుగు పడుతావు. మాట తప్పుడే రేవంత్‌రెడ్డి డీఎన్‌ఏలో ఉంది. ఏ విషయంలో కూడా మాట మీద నిలబడలేదు. ఆరు గ్యారెంటీలు అమలుకాలేదు. వృద్ధులకు రూ.4 వేల పెన్షన్, రూ.2500 మహిళలకు ఇస్తానని చెప్పి నెరవేర్చలేదు. రేవంత్‌రెడ్డి వచ్చిన తర్వాత రైతు బంధు రాలేదు. కేసీఆర్ కిట్, న్యూట్రిషన్‌కిట్, బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీ, బీసీ బంధు, దళిత బంధు, ముదిరాజ్‌లు చేపల పిల్లలను కోల్పోయారు. కరోనా సమయంలో మంత్రుల, ఎమ్మెల్యేల జీతాలు బంద్‌పెట్టి రైతులకు రైతుబంధు ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్. అప్పుడు వచ్చిన రైతుబంధు ఇప్పుడు ఎందుకు రావడం లేదు ? కేసీఆర్ తన హయాంలో రైతుల కోసం 24 గంటల కరెంట్ ఇచ్చారు, వాగులపై చెక్‌డ్యాంలు కట్టారు. అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపారు. రైతు సీఎం కేసీఆర్ అయితే, బూతుల సీఎం రేవంత్‌రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment