దాడులకు పాల్పడటం అనాగరిక చర్య
అలంపూర్: న్యాయవాదులపై భౌతిక దాడులకు పాల్పడటం ఆనాగరిక చర్య అని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ అన్నారు. అలంపూర్ పట్ణంలోని కోర్టులో న్యాయవాదులు హూసురు ఘటనకు నిరసనగా గురువారం విధులను బహిష్కరించారు. కోర్టు ఆవరణలో నినాదాలు చేశారు. అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్ అధ్వర్యంలో న్యాయవాదులు అత్యవసర సమావేశం నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రంలోని హూసురులో న్యాయవాదిపై జరిగిన దాడికి నిరసనగా రెండు రోజులు కోర్టు కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. తీర్మానం కాపీని న్యాయమూర్తి మిథున్‌తేజకు అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్యాయానికి గురైనవారు ప్రజాస్వామ్య పద్ధతిలో న్యాయపోరాటం చేయాలని, భౌతిక దాడులకు పాల్పడడం సరికాదన్నారు. దాడి చేసిన వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి ఆంజనేయులు, కోశాధికారి గవ్వల శ్రీనివాసులు, కర్నూల్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు చాంద్ బాష, న్యాయవాదులు రాజేశ్వరి, నారయణ రెడ్డి, తిమ్మారెడ్డి, నాగరాజు యాదవ్, శ్రీధర్ రెడ్డి, గజేంద్రుడు, వెంకట్రాముడు, మధు, వజ్ర భాస్కర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment