ఇబ్బందులు పడుతున్నాం..
చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం సమయంలో చలిలోనే పారిశుద్ధ్య పనులు చేస్తున్నాం. వయసు పైబడిన వారు ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం తర్వాత ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. చలి మంటలతో ఉపశమనం పొందుతున్నాం.
– నర్సింహులు, పారిశుద్ధ్య కార్మికుడు, కేటీదొడ్డి
వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
చలి వెన్నులో వణుకు పుట్టిస్తుంది. రాత్రివేళ పంటకు నీరు పెట్టేందుకు వ్యవసాయ పొలానికి వెళ్లాలంటే జంకుతున్నాం. కూరగాయల అమ్మకందారులు, వ్యవసాయదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. సాయంత్రం 6 గంటలు అయిందంటే ఇంట్లోనే ఉంటున్నాం.
– గద్వాల తిమ్మప్ప, రైతు, కేటీదొడ్డి
Comments
Please login to add a commentAdd a comment