● పొడి చర్మం ఉన్నవారు ఎక్కువగా ఇబ్బందిపడే అవకాశం ఉంది. చర్మం పగుల్లిచ్చి మంట పుడుతుంది. అందువల్ల చర్మం పొడిబారి పోకుండా చూసుకోవాలి. ఇందుకోసం వ్యాస్‌లెన్, పెట్రోలియంజెల్లి, మాయిశ్చరైజర్లు వాడాలి. స్నానానికి కూడా గ్లీజరిన్, మాయిశ్చరైజర్ ఉన్న సబ్బులు వాడటం ఉత్తమం.
చిన్నారుల విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వాతావరణ మార్పుల వల్ల చిన్నారులు త్వరగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఉదయం, సాయంత్రం వారిని బయట తిరగనీయొద్దు. గ్రామాల నుంచి పట్టణాల్లోని పాఠశాలలకు ఉదయం సమయాల్లో బస్సు, ఆటోల్లో వెళ్లే విద్యార్థులు విధిగా స్వెటర్లు, మంకీ క్యాప్‌లు ధరించాలి. పిల్లలకు ఎక్కువగా జలుబు చేస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment