జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల నమోదు
తీవ్రమైన చలితో ఇబ్బందులు పడుతున్న చిన్నారులు, వృద్ధులు
రాత్రివేళ నిర్మానుష్యంగా చౌరస్తాలు
గద్వాలటౌన్/కేటీదొడ్డి: చలి అంటేనే ఒంట్లో వణుకు పుడుతోంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరినీ గజగజలాడిస్తోంది. శీతాకాలం ఆరంభంలో మొదట చలి తీవ్రత కాస్త తక్కువగా ఉన్నప్పటికీ.. గడిచిన వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇప్పటి వరకు కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల స్థాయికి పడిపోయింది. రానున్న రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఘననీయంగా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. సాయంత్రం 5 నుంచి చలి మొదలై ఉదయం 9 గంటల వరకు వణికిస్తుంది. తీవ్రమైన చలితో పిల్లలు, వృద్ధులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది స్వె టర్లు, శాలువాలు, దుప్పట్లతో చలి నుంచి రక్షణ పొందడానికి యత్నిస్తున్నారు.
చీకటి పడగానే రోడ్లు నిర్మానుష్యం..
వారం రోజుల వ్యవధిలో రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. జిల్లా కేంద్రంతో పాటు అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీలతో పాటు ఆయా మండలాల్లో ఉదయం, సాయంత్రం సమయాల్లో ద్విచక్ర వాహనంపై తిరగలేని పరిస్థితి ఉంది. చీకటి పడగానే రోడ్లు, ప్రధాన చౌరస్తాలు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారుతున్నాయి. షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు, బస్టాండ్లు జనం లేక బోసిపోయి కనిపిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ఉదయం 9 గంటలు దాటినా పట్టణాల్లో జన సంచారం కనిపించడం లేదు. మున్సిపాలిటీలు, గ్రామాల్లో పారిశుద్ధ్య కార్మికులు చలి తీవ్రతతో ఇబ్బందులు పడుతున్నారు.
వారం రోజులుగా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రతలు..
10th 19.8
11th 18.8
12th 14.7
13th 17.9
14th 17.2
15th 14.8
16th 11.5
Comments
Please login to add a commentAdd a comment