90 రోజుల కార్యాచరణ పకడ్బందీగా అమలు
అయిజ: ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు 90 రోజుల కార్యాచరణను పకడ్బందీగా అమలుపర్చాలని డీఐఈఓ హృదయరాజు అధ్యాపకులను ఆదేశించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాలలో 90 రోజుల కార్యాచరణ అమలు తీరును పరిశీలించారు. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థుల హాజరు పట్టికలు, టీచింగ్ డైరీలు, యూనిట్ టెస్ట్‌లు, అర్ధసంవత్సరపు మార్కులను పరిశీలించారు. ఫెయిల్ అయిన విద్యార్థులను మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు.
రాష్ట్రంలో బలమైన పార్టీగా బీజేపీ
అలంపూర్: రాష్ట్రంలో బలమైన పార్టీగా బీజేపీ బలోపేతం అవుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం అలంపూర్ పట్టణంలోని టూరిజం హోటల్‌లో బీజేపీ పోలింగ్ బూత్‌ల అధ్యక్షులను ఎంపిక చేసి, నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను ఏడాది గడిచినా అమలు చేయలేదన్నారు. మోసపూరిత మాటలతో కాలం వెల్లదీస్తున్న కాంగ్రెస్ పార్టీని రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలు తరమికొట్టడం ఖాయమన్నారు. త్వరలోనే జిల్లా, మండల కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. అనంతరం అలంపూర్ చౌరస్తాలో బీజేపీ బూత్ కమిటీల అధ్యక్షులు ఎన్నిక నిర్వహించారు. ఉండవెల్లి మండలంలో 22 బూత్ కమిటీల అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కేకే రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజశేఖర శర్మ, జిల్లా అధికార ప్రతినిధి ఈశ్వర్, నాగేశ్వర్ రెడ్డి, నాగమల్లయ్య, రాము నాయడు, లక్మణ్ నాయుడు, శరత్, సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు.
వేరుశనగ క్వింటా
రూ. 6,511
గద్వాల వ్యవసాయం: జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డుకు మంగళవారం 501 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి వచ్చింది. క్వింటా గరిష్టంగా రూ. 6,511, కనిష్టంగా రూ. 3,099, సరాసరి రూ. 5,839 ధరలు పలికాయి. 31 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 5,525, కనిష్టంగా రూ. 5,369, సరాసరి రూ. 5,479 ధరలు లభించాయి. 1143 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,589, కనిష్టంగా రూ. 1,822, సరాసరి రూ. 2,519 ధరలు వచ్చాయి. 386 క్వింటాళ్ల కందులు రాగా.. గరిష్టంగా రూ. 8,589, కనిష్టంగా రూ. 2,100, సరాసరి రూ. 7269 ధరలు పలికాయి.
Comments
Please login to add a commentAdd a comment