కోర్టు భవన నిర్మాణం త్వరలోనే ప్రారంభిస్తాం
గద్వాల న్యూటౌన్: ఇంటిగ్రేటెడ్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి ఎదురవుతున్న అవాంతరాలపై మంగళవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘సందిగ్ధం!’ కథనానికి కలెక్టర్ బీఎం సంతోష్ స్పందించారు. ఇంటిగ్రేటెడ్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి గద్వాల మండలం పూడూరు శివారులోని సర్వే నంబర్ 368లో కేటాయించిన 10 ఎకరాల స్థలాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లొకేషన్ మ్యాప్‌ను చూశారు. అధికారులతో వివరాలను తెలుసుకున్నారు. కోర్టు నిర్మాణానికి సంబంధించి రెండు వర్గాల న్యాయవాదుల నుంచి సమస్యలపై ఆరా తీశారు. కోర్టు కాంప్లెక్స్ నిర్మాణానికి సంబంధించి రహదారి కనెక్టివిటిని కూడా పరిశీలించారు. ప్రధాన రహదారి నుంచి కోర్టు భవనానికి కేటాయించిన స్థలం వరకు రహదారిని నిర్మించవచ్చని చెప్పారు. ప్రజల సౌకర్యార్థం కోర్టు నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. వారి వెంట తహసీల్దార్ మల్లిఖార్జున్, ఇరువర్గాల బార్ అసోసియేషన్ సభ్యులు ఉన్నారు.
ఇంటిగ్రేటెడ్ జిల్లా కోర్టు కాంప్లెక్స్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ బీఎం సంతోష్
Comments
Please login to add a commentAdd a comment