జోగుళాంబ గద్వాల
గురువారం శ్రీ 19 శ్రీ డిసెంబర్ శ్రీ 2024
జిల్లాలో వారం రోజులుగా చలితీవ్రత పెరిగిందని.. పశువులు, ఇతర పెంపుడు జంతువులను చలి బారి నుంచి కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరుబయట కాకుండా షెడ్లలో ఉంచాలని, పాకల చుట్టూ గోనె సంచులు ఏర్పాటుచేయాలని తదితర సలహాలు, సూచనలు జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
● గేదెలు, తెల్లజాతి పశువులు, గొర్రెలు, మేకలను షెడ్లలో లేదా పాకలలో కట్టివేయాలి. పాకలపైన జమ్ము లేదా వరిగడ్డిని వేయాలి. షెడ్డు, పాకల చుట్టూ గోనెసంచులు కట్టాలి. సాధారణంగా చలి ఉన్నప్పుడు దోమలు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి కాపాడడానికి షెడ్డు, పాకలలో వేపాకు లేదా మోదుగ ఆకులతో పొగవేయాలి. ఉదయం 10గంటల తర్వాత మేతకు తీసుకెళ్లి సాయంత్రం 5గంటలలోపు తీసుకరావాలి.
న్యూస్‌రీల్
పెంపుడు కుక్కలను చిన్నపాటి షెడ్ లేదా చిన్న గదిలో ఉంచాలి. కోళ్లకు జాలిలతో కూడిన చిన్న షెడ్‌లలో సంఖ్యను బట్టి 40 నుంచి 100 వాట్స్ బల్బులను ఏర్పాటు చేయాలి.అనారోగ్యానికి గురైన జీవాలకు క్యాల్షియం, లివ ర్ టానిక్, బీ కాంప్లెక్స్ మందులు.. కుక్కలకు బీ కాంప్లెక్స్, న్యూరోబియాన్ మందులు, కోళ్లకు బీకాంప్లెక్స్ టానిక్ మందులు వాడాలి.
Comments
Please login to add a commentAdd a comment