క్రీడలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
గద్వాలటౌన్ : రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా మార్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి క్రీడలపై ప్రత్యేక దృష్టి సారించారని డీవైఎస్‌ఓ బీఎస్ ఆనంద్ అన్నారు. సీఎం కప్ క్రీడా పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. పోటీలలో బాగంగా బుధవారం ఫుట్‌బాల్, చెస్, షటీల్, హాకీ పోటీలను నిర్వహించారు. స్థానిక మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలను డీవైఎస్‌ఓ ఆనంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కప్ పోటీల వేధిక ద్వారా ప్రతిభ ఉన్న క్రీడాకారులు వెలుగులోకి వస్తారని చెప్పారు. పోటీలలో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని, అత్యుత్తమ ప్రతిభ కనబరిచి సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు. చెస్ సబ్ జూనియర్స్ బాలుర విభాగంలో ప్రహల్‌దాస్ విన్నర్‌గా, అజయ్ రన్నర్‌గా, బాలికల విభాగంలో నికిత విన్నర్‌గా, విజయ రన్నగా నిలిచారు. ఫుట్‌బాల్ బాలురు పోటీలలో గద్వాల జట్టు విజేతగా నిలువగా, మల్థకల్ జట్టు రన్నర్‌గా నిలిచింది. బాలికల పోటీలలో గద్వాల జట్టు విన్నర్‌గా, ఉండవెల్లి రన్నర్‌గా నిలిచింది. గెలుపొందిన క్రీడాకారులకు ప్రశంస పత్రాలు, మెడల్స్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి జితేందర్, ఆయా క్రీడల కన్వీనర్లు బషీర్, నగేష్‌బాబు, హైమవతి, సుహాసిని, కృష్ణయ్య, శ్రీనివాసులు, రత్నమాల, నిర్మల, నర్సింహారాజు, వెంకట్రాములు, మోహనమురళి, సతీష్‌కుమార్, శ్రీనివాసులు, విజయ్, స్వప్న, స్రవంతి, రఘు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment