ఉద్యాన వికాసం..!
ఏటేటా పెరుగుతున్న పండ్లతోటల సాగు
నడిగడ్డ నేలలు అనుకూలం
పండ్లతోటలకు జిల్లాలో అనువైన పరిస్థితులు ఉన్నాయి. పండ్లతోటలు, కూరగాయల సాగుకు ఎర్రటి, ఒండ్రుతో కూడిన ఎర్రటి నేలలు ఉండాలి. నడిగడ్డలో ఇలాంటి నేలల శాతమే ఎక్కువగా ఉంది. సాగునీటి విషయానికి వస్తే జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్ట్‌లతో పాటు, నెట్టెంపాడు ఎత్తిపోథల, రిజర్వాయర్లు, నోటిఫైడ్ చెరువులు, చెరువులు ఉన్నా యి. వీటన్నింటి ఫలితంగా బోర్లు, బావుల్లో ఆశించిన స్థాయిలో నీరు ఉంటోంది. సాధారణంగా పండ్లతోటలను బోర్లు, బావుల కిందే సాగు చేస్తారు. ఇక వాతావరణ విషయానికి వ స్తే వేసవిలో పగటి ఉష్ణోగ్రతలు ఎంత ఉన్నా.. సాయంత్రం నుంచి రాత్రి వరకు చల్లగా ఉంటుంది. శీతాకాలంలో ఎంత చలి ఉన్నా.. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవు. ఇలా నేలలు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
గద్వాల వ్యవసాయం: జిల్లాలో పండ్ల తోటలు సాగు ఏటేటా పెరుగుతోంది. రెండేళ్ల క్రితం 9వేల ఎకరాల్లో సాగు చేయగా.. నేటికి వచ్చే సరికి దాదాపు 5వేల ఎకరాలు పెరిగి దాదాపు 15వేల ఎకరాలకు చేరింది. నీటి వనరులు పుష్కలంగా ఉండటంతో పాటు ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు పండ్లతోటలకు అనుకూలంగా ఉన్నాయి. దీనివల్ల పండ్లతోటల సాగుపై రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. గడిచిన ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే ఏటా సాగు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
రైతులను ప్రోత్సహిస్తున్నాం
పండ్ల తోటలకు ఇక్కడి నేలలు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడి రైతులు పండ్లతోటల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. పండ్ల తోటల సాగుకు ముందుకు వచ్చే రైతులను ఉద్యానశాఖ పరంగా వారిని ప్రోత్సహిస్తున్నాం. దీనికి సంబంధించి పథకాల అమల్లో అర్హులైన రైతులను గుర్తించి, వారికి ప్రోత్సాహకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నాం.
– ఎంఏ అక్బర్, జిల్లా ఉద్యానశాఖాధికారి
జిల్లాలో నేలలు, వాతావరణం అనుకూలం
పండ్ల తోటల పట్ల రైతుల ఆసక్తి
జిల్లాలో 14,745 ఎకరాల్లో
పండ్లతోటలు సాగు
Comments
Please login to add a commentAdd a comment