వేగంగా న్యాయ సేవలు
అలంపూర్/ఉండవెల్లి: ఈ సేవ కేంద్రం ద్వారా మరింత వేగంగా న్యాయ సేవలు పొందవచ్చని అలంపూర్ కోర్టు న్యాయమూర్తి మిథున్ తేజ అన్నారు. మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వర్చువల్‌గా అలంపూర్ కోర్టులో ఈసేవ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రస్తుతం కోర్టు ద్వారా పొందుతున్న సేవలతో పాటు ఈ సేవ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఉండవెల్లి రైతువేదికలో చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంట సాగుకు వినియోగించే విత్తనం నుంచి క్రిమిసంహారక మందుల ద్వారా రైతులు నష్టపోతే.. చేపట్టాల్సిన చట్టపరమైన చర్యలను వివరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్, రైతు సంఘం సభ్యులు జ్ఞానేశ్వర్‌రెడ్డి, గోద జయ్యన్న, గోవిందు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment