పెరిగిన మోసాలు
లోక్‌అదాలత్ ద్వారా 13,758 కేసుల
పరిష్కారం
గేమింగ్ యాక్ట్ కేసులో స్వాధీనం చేసుకున్న నగదు
రూ. 10,91,754
గతేడాది కంటే 98 శాతం అధికం
● ఐదు ఎన్‌డీపీఎస్ కేసులు నమోదు
● తగ్గని ఇసుక అక్రమ రవాణా
● రోడ్డు ప్రమాదాల్లో 112 మంది మృతి
● వార్షిక నేర సమీక్షలో ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడి
950.74 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
ఈ పెట్టి
కేసులు 12,864
3,206 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ. 32,06,000 జరిమానా
గద్వాల క్రైం: జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది నవంబర్ నాటికి 2,419 కేసులు నమోదయ్యాయి. గతేడాది డిసెంబర్ నాటికి 2,419 కేసులు నమోదు కాగా.. తాజా లెక్కల ప్రకారం ఈ ఏడాది కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సంవత్సరం నడిగడ్డలో తొలి ఐదు ఎన్‌డీపీఎస్ (గంజాయి) కేసులు నమోదయ్యాయి. ఇసుక అక్రమ రవాణా ఏమాత్రం తగ్గలేదు. పేకాట, గుట్కా, నకిలీ విత్తనాలు, మట్టి, బియ్యం అక్రమ రవాణా, అత్యాచారాలు, చోరీలు, మిస్సింగ్ కేసులతో పాటు చీటింగ్ కేసులు పెరిగాయి. జిల్లా పోలీ సు కార్యాలయంలో మంగళవారం ఎస్పీ శ్రీనివాసరావు వార్షిక నేర సమీక్ష నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది చోటుచేసుకున్న నేరాల వివరాలను ఎస్పీ వెల్లడించారు.
గతేడాది కంటే అధికమైన చీటింగ్..
జిల్లాలో గతేడాది కంటే ఈ ఏడాది చీటింగ్ కేసులు 98 శాతం అధికంగా నమోదయ్యా యి. చోరీకి గురైన సొమ్మును 60 శాతం పోలీ సులు రికవరీ చేశారు. సైబర్ నేరాలకు సంబంధించి బ్యాంక్ ఖాతాల నుంచి తస్కరించిన రూ. 55.29 లక్షలను ఫ్రీజ్ చేశారు. బాధితులకు రూ. 10.59 లక్షలు రికవరీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు పటిష్టమైన నిఘా ఉంచి.. మద్యం, రేషన్ దందాలను కట్టడి చేశారు. రోడ్డు ప్రమాదాల్లో 112 మంది మృతి చెందారు. క్షణికావేశంలో కొందరు హత్యలకు పాల్పడ్డారు.
నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు..
వివిధ పోలీస్ స్టేషన్‌ల్లో నిర్లక్ష్యంగా విధులు నిర్వహించిన కిందిస్థాయి సిబ్బంది మొదలుకొని ఎస్‌ఐ, సీఐ స్థాయి అధికారులపై పోలీసు శాఖ చర్యలు తీసుకుంది. ఉండవెల్లి శివారులో పేకాట స్థావరంపై దాడులు చేపట్టిన క్రమంలో సిబ్బంది పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసినట్లు అందిన ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకున్నారు.
శాంతిభద్రతల్లో అప్రమత్తం..
సమస్యాత్మక గ్రామాలపై పోలీసులు నిరంతరం నిఘా ఉంచి.. ప్రశాంత వాతావరణం కల్పిస్తున్నారు. మహిళల రక్షణ కోసం షీ టీం బృందాలు సమర్థవంతంగా విధులు నిర్వహించి.. పలువురిపై ఈవ్ టీజింగ్ కేసులు నమోదు చేశారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా 594 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ‘నేను సైతం’ కార్యక్రమం ద్వారా గద్వాల, అయిజ, శాంతినగర్, అలంపూర్ ప్రాంతాల్లో 1053 సీసీ కెమెరాలను జిల్లా కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. చీకటి దందాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీ సత్యనారాయణ, సీఐలు శ్రీను, రవిబాబు తదితరులు ఉన్నారు.
1,03,535 మోటార్ వెహికిల్ యాక్ట్ ద్వారా రూ. 5,09,74,260 జరిమానా
నియంత్రణలో కీలకం..
నేరాల నియంత్రణలో జిల్లా పోలీసుశాఖ సమర్థవంతంగా విధులు నిర్వహించి తమదైన ముద్రను సొంతం చేసుకుంది. మానవపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన హత్య కేసులో ఆరుగురికి జీవత ఖైదును కోర్టు ఖరారు చేసింది. ఈ కేసులో పోలీ సులు క్రియాశీలకంగా వ్యవహరించారు. చోరీకి గురైన 35 బైక్‌లను రికవరీ చేశారు. చట్టాలపై కళాజాతా బృందంచే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment