ప్రజలకు అమిత్‌షా క్షమాపణ చెప్పాలి
గద్వాలటౌన్: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ.. జిల్లా కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ముందుగా అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, గద్వాల కాంగ్రెస్ ఇన్‌చార్జి సరితల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన ర్యాలీ చేపట్టారు. బీజేపీ, అమిత్‌షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టర్ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ.. అంబేడ్కర్ అంటే బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని.. సంకుచిత రాజకీయ లక్ష్యాల కోసం ఆయన్ను కించపరచాలని చూస్తోందని ఆరోపించారు. అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై హోంశాఖ మంత్రి అమిత్‌షా దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం సరిత మాట్లాడుతూ.. అమిత్‌షా వ్యాఖ్యలతో రాజ్యాంగాన్ని నమ్ముకున్న ప్రతి పౌరుడి గుండెకు గాయమైందన్నారు. అమిత్‌షాను కేంద్ర మంత్రి వర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీనివాసులు, నాయకులు శంకర్, నల్లారెడ్డి, మధుసూదన్‌బాబు, ఇసాక్, నర్సింహ, భాస్కర్‌యాదవ్, గోవిందు, ఆనంద్, కౌన్సిలర్ మురళి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment