ధరూరు: పంట పొలాల్లో ఉన్న వరికొయ్యలను కాల్చడం వల్ల రైతులకు నష్టమే తప్ప లాభం లేదని జిల్లా ఇన్‌చార్జి వ్యవసాయశాఖ అధికారి సక్రియా నాయక్ అన్నారు. ఈ అంశంపై మంగళవారం ధరూరు రైతువేదికలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు ఆయన హాజరై మాట్లాడారు. వరికోతల అనంతరం గడ్డితో పాటు కొయ్యలను పొలంలోనే కాల్చడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. వరి కొయ్యలను కాల్చకుండా రొటోవేటర్‌తో దున్ని 50 కేజీల సూపర్, 10 కేజీల యూరియా వేసి మరుగబెట్టాలని సూచించారు. తద్వారా భూసారం పెరుగుతుందన్నారు. అలాగే వాతావరణం కాలుష్యానికి గురికాకుండా ఉంటుందన్నారు. అనంతరం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్, పెస్టిసీడ్స్ దుకాణాలను తనిఖీ చేశారు. ఇన్‌చార్జి డీఏఓ వెంట ఏఓ శ్రీలత, ఏఈఓలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment