వైభవంగా పాండురంగడి కల్యాణోత్సవం
గద్వాలటౌన్: బాజా భజంత్రీలు.. వేద మంత్రోచ్ఛరణాల మధ్య..కుంటవీధిలోని రుక్మిణి సమేత పాండురంగస్వామి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా జరిగింది. సాంప్రదాయబద్దంగా దేవతామూర్తులను పూజించి పుణ్యహవాచనం నిర్వహించి కన్యాదానం కొనసాగించారు. కంకణధారణ కడు రమణీయమవగా గోత్రనామాలు చదివారు. సమస్త మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మంగల్యధారణ నయనానందంగా మారింది. కల్యాణ మండపంలో స్వామి, అమ్మవార్లకు పండితులు సాంప్రదాయ బద్దంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. కల్యాణోత్సవాన్ని తిలకించడానికి పట్టణానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పాండురంగస్వామి గోవిందనామస్మరణంతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అనంతరం భక్తులకు ఆన్నదానం నిర్వహించారు.
వైభవంగా
విగ్రహా ప్రతిష్ఠాపన
రుక్మిణి పాండురంగస్వామి ఆలయంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన పూజ కార్యక్రమాలను వైభవంగా చేపట్టారు. గత మూడు రోజులుగా ఆలయ ప్రాంగణంలో విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలో రుక్మిణి పాండురంగస్వామి విగ్రహాలను ప్రతిష్టించారు. ఆలయ ప్రాంగణంలో గణపతి సుభ్రమణేశ్వర, మల్లికార్జున, నంది, నవగ్రహ సహిత నాగదేవతా మూర్తుల ప్రతిష్ట మహోత్సవం వైభవంగా సాగింది. ఈ సందర్భంగా శాంతిహోమం, గర్తపూజ, అమృతసిద్ధి యోగం, నాగబలిపీఠ ప్రతిష్ట తదితర పూజ కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి వేర్వేరుగా పూజలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment