ప్రతి ఒక్కరు సేవాభావం కలిగి ఉండాలి
అలంపూర్: సమాజంలో ప్రతి ఒక్కరు సేవా భావం కలిగి ఉండాలని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి మిథున్ తేజ అన్నారు. అలంపూర్‌లోని జూనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో అడ్వకేట్ బార్ అసోసియేషన్ అధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును సోమవారం నిర్వహించారు. కర్నూల్ మెడికవర్ హాస్పిటల్ వైద్యులు న్యాయవాదులకు, కోర్ట్ సిబ్బందికి, కక్షిదారులకు ఉచితంగా ఈసీజీ, షుగర్, బీపీ వంటి పరీక్షలు నిర్వహించారు. జడ్జి వైద్య శిబిరాన్ని సందర్శించి ఏ విధమైన, ఎన్ని రకాల పరీక్షలు చేస్తున్నారని అడిగి తెలుసుకొన్నారు. మెడికల్ క్యాంపు నిర్వహించడం అభినందనీయమన్నారు. 100 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వైద్యులు ఇమ్రాన్, కొండారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కుమార్, ఏజీపీ మధు, న్యాయవాదులు రాజేశ్వరి, నారయణ రెడ్డి, తిమ్మారెడ్డి, నాగరాజు యాదవ్, శ్రీనివాసులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment