క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
గద్వాలటౌన్ : క్రైస్తవుల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో క్రైస్తవులకు క్రిస్మస్ కానుకలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రైస్తవుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు. కుల, మతాలకు అతీతంగా పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం కల్పిస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే గొప్ప పండగ క్రిస్మస్ అన్నారు. శాంతితోనే మానవజాతి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కుర్వ హనుమంతు, కాంగ్రెస్ నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, ప్రతాప్‌గౌడ్, రాజశేఖర్, కౌన్సిలర్ మురళి, పాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
క్రైస్తవులకు కానుకలు అందజేస్తున్న
ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment