విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి
కేటీదొడ్డి: పోలీసులు విధి నిర్వహణపై మరింత అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సత్యనారాయణ సూచించారు. సోమవారం స్థానిక పోలీసుస్టేషన్ డీఎస్పీ తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టేషన్‌లోని పలు రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల దర్యాప్తు, పురోగతిపై ఆరా తీశారు. అనంతరం పోలీస్ సిబ్బందితో సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ పరిదిలోని నేరాల నియంత్రణ తగిన చర్యలు తీసుకోవాలని ఆయా కేసులలో పట్టుబడిన వాహనాలను కోర్టు అనుమతితో రిలీజ్ చేయాలని ఎస్‌ఐ శ్రీనివాసులకు సూచించారు. కొత్త వ్యక్తుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఓక్కరు అంకితభావంతో పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావలని సూచించారు. సరిహద్దులో పీడీఎస్, ఇసుక, ఇతర అక్రమ రవాణపై నిఘూ ఉంచి పట్టుకోవాలని సిబ్బందికి సూచించారు. పోలీస్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.
క్రీడల్లో ఉత్తమప్రతిభ కనబర్చాలి
అయిజ: క్రీడాకారులు ప్రత్యేక క్యాంపులను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలని డీవైఎస్ బీఎస్ ఆనంద్ అన్నారు. మండల కేంద్రంలోని బ్రైట్ స్టార్ ఉన్నత పాఠశాలలో సీఎం కప్ బాలుర విభాగం ఖోఖో క్రీడాకారుల క్యాంపును సోమవారం ఆయన సందర్శించారు. పోటీల్లో ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచిపేరు తేవాలని కోరారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎస్తేర్, పీడీలు బషీర్, నరసింహ, రాజు, రఘు, పీఈటీలు పాల్గొన్నారు.
విద్యార్థులు
సమాజసేవ చేయాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఎన్‌ఎస్‌ఎస్‌లో పాల్గొనే విద్యార్థులు సమాజసేవ చేయాల్సిన అవసరం ఉందని పీయూ వీసీ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ మేరకు శీతాకాల ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని ఆలీపూర్, బండమీదిపల్లి ప్రాంతాల్లో యూనిట్–9 విద్యార్థులు వారం రోజుల పాటు నిర్వహించారు. సోమవారం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉండే అన్ని రుగ్మతలను రూపుమాపేందుకు ఎన్‌ఎస్‌ఎస్ ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని, గ్రామాల్లో ప్రజలను మద్యపాన నిషేధం, బాల్యవివాహాలు, ఆరోగ్యంపై చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలతో పాటు నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందన్నారు. పీయూలో ఉండే విద్యార్థులు హాస్టల్స్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దాని ద్వారా ఆరోగ్యం పెంపొందించుకోవచ్చని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment