ఇందిరమ్మ ఇళ్ల సర్వేను త్వరగా పూర్తిచేయాలి
గద్వాల: పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల సర్వేను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ హాల్‌లో ఇందరమ్మ ఇళ్ల పథకం మొబైల్ యాప్ సర్వే పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు లబ్ది చేకూర్చేందుకు మొబైల్ యాప్ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. సర్వేకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఆన్‌లైన్‌లో ఆప్‌లోడ్ చేసిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సూపర్‌వైజర్లు, సర్వేయర్లు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పనిచేయాలన్నారు. వారి పనితీరును ఎప్పటికప్పుడు ఎంపీడీఓలు పర్యవేక్షించాలన్నారు. సిబ్బంది కొరత ఉంటే, ఇతర సిబ్బందిని సర్వే కోసం నియమించుకోవాలని సూచించారు. పీఎం ఆవాస్ యాప్‌లో సర్వేయర్లు అందరూ కేవలం ఆన్‌లైన్ అఽథెంటికేషన్ మాత్రమే చేయాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల సర్వేను నిర్ణిత గడువులోగా పూర్తిచేయాలన్నారు. ఈ సమావేశంలో అడిషినల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు, జడ్పీసీఈఓ కాంతమ్మ, డీపీఓ శ్యాంసుందర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి సక్రియానాయక్ తదితరులు పాల్గొన్నారు.
ఫిర్యాదులపై సత్వరం స్పందించండి
గద్వాలటౌన్ : ప్రజావాణి ఫిర్యాదులపై అధికారులు తక్షణం స్పందించాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ సంతోష్ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఆసరా పెన్షన్లు, భూసంబంధిత, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, ఉపాధి, విద్యుత్తు తదితర సమస్యలపై 45 వినతులు వచ్చాయి. ఆయా జిల్లా శాఖల ఆధికారులు సంబంధిత మండల అధికారులతో చర్చించి వారి పరిధిలోని దరఖాస్తులను పరిష్కరించాలన్నారు. దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు లక్ష్మినారాయణ, నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment