సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తా..
గద్వాల: విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగుల డిమాండ్ల సాధ్యాసాధ్యాలపై మరోసారి సీఎం దృష్టికి తీసుకెళ్తానని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తెలిపారు. గత 14 రోజులుగా డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులు సోమవారం సంపత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. తమకు న్యాయం చేయాలని, తమ ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని వారు కోరారు. అందుకు ఆ య న సానుకూలంగా స్పందించారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల ఆవేదనను సీఎం అర్థం చేసుకున్నారని, ఉద్యోగుల డిమాండ్లు సీఎం దృష్టిలో ఉన్నాయన్నారు.
కొనసాగుతున్న నిరసనలు..
డిమాండ్ల సాధన కోసం ఎస్‌ఎస్‌ఏ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలకు వివిధ సంఘాల నాయకులు వేరువేరుగా సంపూర్ణ మద్దతును ప్రకటించారు. 14వ రోజు సోమవారం సైతం కేజీబీవీ సీఆర్‌టీలు, సీఆర్పీలు, డీఎల్‌ఎంటీ, సీసీఓ, పీటీఐ, యూఆర్‌ఎస్ ఉద్యోగ, ఉపాధ్యాయులు ప్లకార్డులు చేతబట్టి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు ఉద్యోగులనుద్ధేశించి మాట్లాడారు. 20 ఏళ్లుగా పనిచేస్తూ గురుకులాలతో సమానంగా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నా శ్రమకు తగిన వేతనం ఇవ్వడం లేదని విమర్శించారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉద్యోగికి జీవిత బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులందరిని ర కమబద్ధీకరించాల, అప్పటి వరకు కనీస వేతన స్కేల్‌ను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు హుస్సేనప్ప, గోపాల్, ప్రణీత, ఖాజా, సమి, శ్రీనివాసులు, శేషన్న, రామంజనేయులు, ఎస్‌ఓలు ఆసియాబేగం, గోపిలత, శ్రీదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment