రైతుల ఆలోచనలో మార్పు
జిల్లాలో రైతులు పత్తి, వరి, వేరుశనగ తదితర పంటలను ఏళ్ల తరబడి నుంచి సాగు చేస్తు వస్తున్నారు. అయితే గడిచిన పదేళ్ల నుంచి రైతుల ఆలోచన సరళిలో మార్పు వస్తోంది. ప్రధానంగా పండ్లతోటలకు ఇక్కడి నేలలు, వాతావరణం అనుకూలంగా ఉండటంకు తోడు ఈసాగు వల్ల పండ్ల రకాన్ని బట్టి మూడేళ్ల నుంచి ఐదేళ్ళ పాటు మంచి నిర్వహణ పద్దతులు అవలంభిస్తే తోటలు బాగా వచ్చి ఆర్థికంగా లాభపడతామన్న ఆలోచనతో రైతులు పండ్ల తోటల పట్ల ఆసక్తి చూపుతున్నారు. మామిడి, బత్తాయి, పొప్పాయి, అంజిర, జామ, డ్రాగన్‌ఫ్రూట్ తదితర పండ్లతోటలు సాగు చేస్తున్నారు. పండ్ల తోటలు సాగు పెరగడానికి మరో కారణం కూడా ఉంది. కేంద్ర ఆదీనంలోని ఎంఐడీహెచ్ పథకంతో పాటు, ఉపాది హమీ పథకం కింద పండ్లతోటల సాగును సబ్సీడీ అందించి ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి పథకాలను ఇక్కడి రైతులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలాంటి పథకాల వల్ల సన్న, చిన్న కారు రైతులు సైతం పండ్లతోటల సాగు పట్ల మొగ్గుచూపుతున్నారు. ఇక ఆర్థికంగా బాగా ఉన్న రైతులు పథకాలతో సంబంధం లేకుండా సాగు చేస్తున్నారు. వీటన్నింటి ఫలితంగా జిల్లాలో పండ్లతోటల సాగు పెరుగుతోంది. 2020–21లో 9679 ఎకరాల్లో పండ్ల తోటలు ఉండగా ప్రస్తుతానికి 14,745 ఎకరాల్లో పండ్లతోటలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment