రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు
గద్వాల: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని ప్రతిఒక్కరికి రోడ్డు భద్రతా ప్రమాణాలపై అవగాహన కల్పించేలా రోడ్డు భద్రతా మాసోత్సవాలను నిర్వహించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. శనివారం రాష్ట్ర బీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఆయన ఎస్పీ శ్రీనివాస్‌రావుతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి మాసాంతం వరకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రోడ్లపై ప్రమాదాలు జరిగినప్పుడు బాధితుల ప్రాణాలను రక్షించేందుకు తక్షణం చర్యలు చేపట్టే విధంగా ప్రణాళిక ఉండాలన్నారు. జిల్లా స్థాయిలో ఉన్న రోడ్‌సేఫ్టి కౌన్సిల్ సమావేశం నిర్వహించి ప్రమాదాలు నిర్వహించే ప్రాంతాలను గుర్తించి అక్కడ అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి పాఠశాల పరిసరాల్లో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించాలన్నారు. రోడ్లు, భవనాల శాఖ, పంచాయతీరాజ్ శాఖ, రహదారుల్లో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. వీటిని రోడ్డురవాణ శాఖ అధికారులు పర్యావేక్షించాలన్నారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ ఈఈ ప్రగతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment