ఉద్యోగ భద్రత కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రత కల్పించాలి

Published Sun, Jan 5 2025 1:56 AM | Last Updated on Sun, Jan 5 2025 1:56 AM

ఉద్యోగ భద్రత కల్పించాలి

ఉద్యోగ భద్రత కల్పించాలి

గద్వాలటౌన్‌: జిల్లాలోని విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష అభియాన్‌ కాంట్రాక్టు ఉద్యోగులను తక్షణం క్రమబద్ధీకరించాలని, తమ ఉద్యోగ జీవితాలకు భద్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తూ ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలు రోజుకో రీతిలో వినూత్నంగా సాగుతున్నాయి. శనివారం 26వ రోజు దీక్ష చేపట్టిన కేజీబీవీ సీఆర్‌టీలు, సీఆర్పీలు, డీఎల్‌ఎంటీ, సీసీఓ, పీటీఐ, యూఆర్‌ఎస్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులు మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అంతకు ముందు ర్యాలీ నిర్వహించి, కృష్ణవేణి చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్‌ ఉపాధ్యాయ, ప్రజాసంఘాల నాయకలు వేర్వేరుగా సంఘీభావం ప్రకటించి పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని, వారిని తక్షణమే క్రమబద్దీకరించాలని డిమాండ్‌ చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతి ఉద్యోగికి జీవిత, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. రెగ్యులర్‌ చేసేవరకు కనీస వేతన స్కేల్‌ను అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు, కేజీబీవీ ఎస్‌ఓలు, సీఆర్‌టీలు, పీఈటీలు, ఏఎన్‌ఎంలు, వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement