పరిశోధనలతోనే ప్రగతి
గద్వాలటౌన్: దేశాన్ని ప్రగతి పథంలో నడిపించాలంటే సైన్స్.. పరిశోధనలతోనే సాధ్యమని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమం ఆదివారం స్థానిక అనంత ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటుచేయగా.. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రం, దేశం అభివృద్ధిలో ముందుకు పోవాలంటే పరిశోధనలు ఎంతో ముఖ్యమని, ఇలాంటి వాటిని ప్రోత్సహించాలన్నారు. విద్యార్థులను తరగతి గదిలో కంటే ప్రయోగశాలల్లోనే ఎక్కువగా ఉంచి కొత్త విషయాలను తెలియజేయాలన్నారు. విద్యార్థుల ఆసక్తిని బట్టి ఆయా రంగాల్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. డీఈఓ అబ్దుల్‌ఘని మాట్లాడుతూ నేటి బాల బాలికల్లోనే బావిశాస్త్రవేత్తలు ఎంతోమంది ఉంటారని, వారిని గుర్తించాల్సిన బాధ్యత గురువులదేనని సూచించారు. గద్వాల ప్రాంతానికి చెందిన సీనియర్ సైంటిస్టులు రాజేశ్వర్‌రెడ్డి, జయతీర్థరావు మాట్లాడుతూ.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారతదేశం గర్వించే స్థాయికి విద్యార్థులు ఎదగాల అన్నారు. సీనియర్, జూనియర్ విభాగాలలో ఏడుగురు చొప్పున, టీచర్ ఎగ్జిబిట్, సెమినార్, ఇన్స్‌స్పైర్ మనక్ విభాగాలలో విజేతలను ఎంపిక చేశారు. 7వ తేదీ జడ్చర్లలో జరిగే రాష్ట్రస్థాయి ప్రదర్శనలలో వీరు పాల్గొంటారని జిల్లా సైన్స్ అఽధికారి బాస్కర్‌పాపన్న తెలిపారు. ఉత్తమ ప్రదర్శన చాటిన విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రశంసా పత్రాలు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment