యాసంగి సాగు షురూ..
సీజన్‌లో వరి,
మొక్కజొన్న ప్రధానం
2024–25 యాసంగి సీజన్ జిల్లాలో ఆరంభం అయ్యింది. వరి, పప్పుశనగ, వేరుశనగ, మొక్కజొన్న పంటలను ఈ సీజన్‌లో ప్రధానంగా వేయనున్నారు. 1,23,161 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు అయ్యే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వానాకాలంలో కురిసిన విస్తారమైన వర్షాల వల్ల బోర్లు, బావులు రీజార్జ్ అయ్యాయి. దీంతో వీటి కింద రైతులు ఇప్పటికే సాగుకు సిద్ధం అయ్యారు. కొన్ని చోట్ల విత్తనాలు వేశారు. వరి పంట వేసేందుకు నారుమడులు సిద్ధం చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు 2వేల ఎకరాల్లో వరి, 14,240 ఎకరాల్లో మొక్కజొన్న, 4300 ఎకరాల్లో వేరుశనగ, 8107 ఎకరాల్లో పప్పుశనగ, 3800 ఎకరాల్లో మినుములు ఇలా దాదాపు 40వేల ఎకరాల్లో పంటలు వేశారు. ఇదిలా ఉంటే యాసంగిలో పంటలకు సాగనీరు అందించేందుకు ఆర్డీఎస్ కింద వారబంధీ అమలు చేస్తుండగా, జూరాల కింద ఇదే పద్ధతని అమలు చేసే అవకాశం ఉంది. మొత్తంగా యాసంగి సీజన్‌లోనూ పంటలు బాగా పండుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గద్వాల వ్యవసాయం: నడిగడ్డలో ఈఏడాది (2024–25) యాసంగి సాగు షురూ అయ్యింది. 1,23,161 ఎకరాల్లో సాగు అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. వానాకాలం సీజన్‌లో ఆశించిన స్థాయిలో అన్ని పంటల దిగుబడులు వచ్చాయి. వానాకాలంలో కురిసిన వర్షాల కారణంగా భూగర్భజలాల నీటి మట్టాలు పెరిగాయి. దీంతో యాసంగి సీజన్‌లో బోర్లు, బావుల కింద సాగుకు సిద్ధం అవుతున్నారు. ఇక ఆర్డీఎస్ కింద ఇప్పటికే వారబందీ అమలు అవుతుండగా, జూరాల కింద కూడా ఈ పద్ధతి వచ్చే అవకాశం ఉంది.
కలిసొచ్చిన సీజన్
2023 వానాకాలం సీజన్ తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పంటలు పండక.. రైతులు ఆర్థికంగా నష్టపోయాడు. కానీ, 2024 వానాకాలం సమృద్ధిగా వర్షాలు కురవడంతో సీజన్ రైతుకు కలిసొచ్చింది. జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురిసాయి. వర్షాలతో బోర్లు, బావులు రీజార్జ్ అయ్యాయి. ఇదే సమయంలో ఎగువన కురిసిన వర్షాలతో జూరాల నుంచి నీటి విడుదల చేశారు. ఇలా అన్ని పరిస్థితులు అనుకూలం కావడంతో ఈ సీజన్ సాఫీగా సాగింది. పత్తి, కంది, వరి, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటల దిగుబడులు బాగానే వచ్చాయి.
ఇప్పటికే 40వేల ఎకరాల్లో సాగు
(ఎకరాల్లో)
వరి నాట్లకు సిద్ధమవుతున్న రైతులు
ఆర్డీఎస్ కింద వారబందీ పద్ధతిన నీరందించే అవకాశం
1.23 లక్షల ఎకరాల్లో సాగు చేయనున్నట్లు అధికారుల అంచనా
అంచనా మేరకు సాగు
వానాకాలం సీజన్‌లో అన్ని పంటల దిగుబడులు బాగా వచ్చాయి. యాసంగి సీజన్ జిల్లాలో ఇప్పటికే ఆరంభించారు. బోర్లు, బావుల కింద సాగు బాగా పంటల సాగు జరుగుతుందని భావిస్తున్నాం. అంచనా మేరకు పంటలు సాగు అయ్యే అవకాశం ఉంది. – సక్రియా నాయక్, డీఏఓ
Comments
Please login to add a commentAdd a comment