దారి తప్పుతున్న యువత
వనపర్తి: ఉన్నత చదువులు చదివి.. బంగారు భవిష్యత్‌కు బాట లు వేసుకుంటూ.. పుట్టిన ఊ రు, కన్నవారికి పేరు, ప్రఖ్యా తు లు తీసుకురావాల్సిన యువత వా రు. కానీ, జల్సాలకు అలవాటుపడి పెడదారి పట్టారు. ఈజీ మనీ కోసం దొంగల అవతారమెత్తి.. చివరికి కటకటాల పాలవుతున్నారు. వీరిలో అందరూ 30 ఏళ్లలోపు యువత ఉండటం విశేషం. వనపర్తి జిల్లా పోలీసులు పట్టుకున్న దొంగలను, ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించిన విస్తుపోయే వివరాలను గమనిస్తే ఇదే విషయం తేటతెల్లమవుతోంది.
ఏడు కేసుల్లో.. 17 మంది
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ రావుల గిరిధర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఏడు కేసుల్లో 17 మంది నిందితులను గుర్తించి కోర్టులో హాజరు పరుస్తున్న విషయంతో పాటు నేరాలకు పాల్పడిన విధానం, నేరం వైపు వారిని నడిపించిన తీరు.. పేరు మోసిన సైబర్ నేరగాళ్ల వివరాలను వెల్లడించారు. 17 మంది నిందితుల్లో అందరూ 30 ఏళ్లలోపు యువకులు.. ఇంజినీరింగ్ చదివిన ఓ మహిళ ఉందని ఎస్పీ విస్మయం వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాకేంద్రంతో పాటు గోపాల్పేట మండలంలోని మున్ననూరు, గద్వాల తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 35 మంది యువకులు.. కోల్కత్తా, పాట్నా, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన అంకిత్, రాహుల్, పంకజ్ అనే పేరుమోసిన నేరగాళ్ల ఉచ్చులో పడి ధని, ముద్ర రుణాలు ఇప్పిస్తామంటూ అమాయకులకు కాల్ చేసి ప్రాసెసింగ్ ఫీజు, ఇన్సూరెన్స్ అంటూ.. రూ.2 కోట్లకుపైగా దోచుకున్నారు. ఇలా వచ్చిన డబ్బుల్లో 20 – 30 శాతం స్థానిక యువకులు ఇవ్వడంతో వారు ఆ డబ్బులతో విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి.. నేరాలు చేసేందుకు ప్రేరేపితులవుతున్నట్లు ఎస్పీ చెప్పారు. అలాగే సైబర్ నేరంలో మొత్తం 35 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించగా.. ప్రస్తుతం ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. వీరిలో ఆరుగురు వనపర్తి, మరొకరు గద్వాల జిల్లాకు చెందిన యువకుడు ఉన్నారు.
● గోపాల్‌పేటలోని రెండు ఇళ్లలో, బుద్దారంలో తాళం వేసి ఉన్న ఓ ఇంటి తాళాలు పగులగొట్టి నగదు, బంగారం తదితర విలువైన వస్తువులను అపహరించిన కేసుల్లో నిందితులు 30 ఏళ్లలోపు యువకులే కావడం గమనార్హం.
● ఆత్మకూరు పీఎస్ పరిధిలో ఓ యువకుడు సులభంగా డబ్బు సంపాదించాలని ఆలయాల్లో కంచు గంటలు అపహరించేందుకు అలవాటు పడ్డాడు.
● మరో ఇద్దరు యువకులు ఇదే పీఎస్ పరిధిలో కూరగాయలు విక్రయించేవారు.. కాయకష్టం చేసుకునే వారిని దూరపు బంధువులుగా నమ్మిస్తారు. వారికి కల్లు తాగించి మత్తులోకి వెళ్లాక వారి ఇంటిలో, ఒంటిపై ఉన్న బంగారం, నగదు చోరీ చేశారు. ఈ మూడు చోరీలకు పాల్పడిన నిందితుడు గోపాల్పేట మండలం బుద్దారం గ్రామానికి చెందిన 25 ఏళ్ల అశోక్‌గా పోలీసులు తేల్చారు.
యూట్యూబ్‌లో చూసి..
గతేడాది డిసెంబర్ నెలాఖరున వరుస సెలవులు రావడంతో అమరచింతలోని యూ నియన్ బ్యాంకులో చోరీకి ప్రయత్నించిన వారికి నాయకత్వం వహించింది ఇంజినీరింగ్ చదువుకున్న ఓ మహిళ. ఈజీ మనీ కోసం యూట్యూబ్‌లో కొన్ని వీడియోలను చూసి సొంత ప్రణాళికతో ఇంటి నిర్మాణం కోసం తెచ్చుకున్న గడ్డపార, ఇతరత్రా ఇనుప వస్తువులతో చుట్టుపక్కల ఉండే మరికొందరు యువకులను సిద్ధం చేసి బ్యాంకును లూటీ చేసేందుకు విఫలయత్నం చేసింది. పలుమార్లు రెక్కీ నిర్వహించడం, బ్యాంకు చుట్టూ అను మానాస్పదంగా తిరగడం వంటి దృశ్యాలను ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు.. లోతుగా విచారణ చేయగా.. నేరం చేసేందుకు ప్రయత్నించినట్లు సదరు మహిళ నాయకత్వంలో విఫలయత్నం చేసిన బృందం ఒప్పుకుంది. దీంతో వారి నుంచి బ్యాంకు గ్రిల్స్‌ను పగులగొట్టేందుకు ఉపయోగించిన గడ్డపార, ఇనుప వస్తువులు, బ్యాంకులోని సీసీ కెమెరా పుటేజీ స్టోరేజీ డీవీఆర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
జల్సాల కోసం చోరీలు
ఈజీ మనీ కోసం దొంగలుగా మారుతున్న వైనం
నిందితుల్లో ఇంజినీరింగ్ చదివిన మహిళ, 30 ఏళ్లలోపు యువకులు
ఒకేరోజు 17 మంది
నిందితుల రిమాండ్
విస్తుపోయే వివరాలు వెల్లడించిన ఎస్పీ రావుల గిరిధర్
Comments
Please login to add a commentAdd a comment