ఫిర్యాదుల పరిష్కారంపై నిర్లక్ష్యం వద్దు
గద్వాల: వివిధ సమస్యలపై ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 47 ఫిర్యాదులు అందగా.. వాటి పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు పంపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై నిర్లక్ష్యం వహించరాదన్నారు. ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని.. లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్‌నాలెడ్డ్‌మెంట్ ద్వారా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment