మళ్లీ కోళ్ల పందేలు!
ఏపీ వైపు చూపు..
సంక్రాంతి పండగ సందర్భంగా కోళ్ల పందేలు ఉంటాయని గుర్తించిన జిల్లా పోలీసుశాఖ.. నిఘా పెంచడంతో పాటు ఈ నెల 3న పలువురు పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకుంది. అయితే ఆదిలోనే కట్టడి చేస్తున్నారని పందెంరాయుళ్లు తమ మకాంను మార్చే ఆలోచనలో పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని పచ్చిమ గోదావరి జిల్లాతో పాటు అనుబంధ ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఏపీలో కోళ్ల పందేల నిర్వహణ జోరుగా సాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నడిగడ్డకు చెందిన పలువురు కోళ్ల పందేల విషయంపై ఇప్పటి నుంచే వాకబు చేస్తున్నారు. రూ. వేలు మొదలుకుని రూ. లక్షల్లో బెట్టింగ్‌లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు.
సంక్రాంతి పండగ వేళ నడిగడ్డలో రహస్య స్థావరాలు ఏర్పాటు
‘ఇటిక్యాల మండలం ఎర్రవలి శివారులోని ఓ వెంచర్‌లో ఈ నెల 3న కొందరు పందెంరాయుళ్లు రూ. వేలల్లో పందెం వేసుకొని రెండు కోళ్లను బరిలోకి దింపారు. సమాచారం అందుకున్న పోలీసులు కోళ్ల పందెం స్థావరంపై దాడులు చేశారు. ఐదుగురు పందెంరాయుళ్లను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. ఈ ఘటనతో జిల్లాలో కోళ్ల పందేలు మళ్లీ ప్రారంభమయ్యాయని స్పష్టమవుతోంది.’
గద్వాల క్రైం: సంక్రాంతి పండగ వేళ నడిగడ్డలో కోళ్ల పందేలు మొదలయ్యాయి. పందెంరాయుళ్లు రహస్య స్థావరాలను ఏర్పాటు చేసుకుని రూ. వేలల్లో పందేలు కాస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు అలంపూర్, ఇటిక్యాల, ధరూర్, మల్దకల్, గట్టు, రాజోళి, అయిజ, శాంతినగర్, మానవపాడు, కేటీదొడ్డి తదితర మండలాల్లో గుట్టుగా కోళ్ల పందేల నిర్వహణకు శ్రీకారం చుడుతున్నారు. కోళ్ల పందేలపై పోలీసులు నిఘా ఉంచిన్పటికీ.. వ్యవసాయ పొలాలు, గ్రామాల శివారులోని వెంచర్లలో పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది.
● రూ. వేలల్లో పందేలు
● నిఘా పెట్టిన పోలీసులు
● తాజాగా ఐదుగురు పందెంరాయుళ్ల అరెస్టు
● ఇటిక్యాల పోలీస్‌స్టేషన్‌లో
కేసు నమోదు
క్రిమినల్ కేసులు నమోదు..
జిల్లావ్యాప్తంగా కోళ్ల పందేలపై నిఘా ఉంచాం. ఎక్క డైనా నిషేధిత జూద క్రీడ లు నిర్వహించినా, ఆడినా క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. రెండు రాష్ట్రాల సరిహద్దులో నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నాం. గతంలో జరిగిన ఘటనల ఆధారంగా ఆరా తీస్తున్నాం. ఎవరైనా కోళ్ల పందేలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే ప్రజలు పోలీసులకు సమాచారం అందజేయాలి.
– శ్రీనివాసరావు, ఎస్పీ
Comments
Please login to add a commentAdd a comment