వీపనగండ్ల: మిషన్ భగీరథ పథకం ద్వారా జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నామని.. ఎలాంటి అభ్యంతరాలున్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని మిషన్ భగీరథ ఈఈ మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని కల్వరాల, తూముకుంటలో పర్యటించి ఆయా గ్రామాల్లో నీటి సరఫరా వివరాల నమోదును పరిశీలించారు. గ్రామాల్లోని ట్యాంకుల ద్వారా తాగునీరు అందించేటప్పుడు నిబంధనలకు అనుగుణంగా శుభ్రం చేయడం, సరైన మోతాదులో బ్లీచింగ్ పౌడర్ కలుపడం చేయాలని.. నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మిషన్ భగీరథ పైపులైన్లకు నష్టం కలిగిస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, సరఫరాలో ఎలాంటి జాప్యం జరగొద్దని సూచించారు. ఆయన వెంట దీఈ అనీల్‌కుమార్, ఏఈ విశ్వనాథ్, గ్రిడ్ ఏఈ నరేశ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment