జోగుళాంబ సన్నిధిలో ప్రముఖులు
అలంపూర్: దక్షిణకాశీ అలంపూర్ ఆలయాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి సునీత, కర్నూలు శిక్షణ కలెక్టర్ చల్లా కల్యాణి, జాయింట్ కలెక్టర్ దివ్య వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. స్థానిక అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం పలికారు. వీరితోపాటు ఆలయ అధికారులు బ్రహ్మయ్య ఆచారి, సిబ్బంది ఉన్నారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తుల గడువు పొడిగింపు
గద్వాల: రాష్ట్ర మైనారిటీ సంక్షేమ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో గ్రూప్– 1, 2, 3, 4, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ బ్యాంకింగ్ ఇతర ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తు తేదీని ఈ నెల 15 వరకు పొడిగించినట్లు మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి రమేష్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల మైనారిటీ నిరుద్యోగ యువత పరీక్ష నిమిత్తం నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాలను జతపర్చాలన్నారు. ఈ నెల 15 సాయంత్రం 5 గంటలలోపు కలెక్టరేట్‌లోని మైనారిటీ సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.
760 క్వింటాళ్ల వేరుశనగ రాక
గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని మార్కెట్ యార్డుకు శుక్రవారం 760 క్వింటాళ్ల వేరుశనగ రాగా, గరిష్టం రూ.6,689, కనిష్టంగా రూ.3,316, సరాసరి రూ.4,870 ధరలు పలికాయి. 5 క్వింటాళ్ల ఆముదాలు రాగా సరాసరిగా రూ.5,419 ఒకే ధర లభించింది. 188 క్వింటాళ్ల వరి (సోన) రాగా గరిష్టంగా రూ.2,450, కనిష్టంగా రూ.2,211, సరాసరిగా రూ.2,309 ధరలు వచ్చాయి. 165 క్వింటాళ్ల కంది రాగా.. గరిష్టంగా రూ.7,266, కనిష్టం రూ.4,000, సరాసరిగా రూ.7,129 చొప్పున పలికాయి.
Comments
Please login to add a commentAdd a comment