కొత్త రేషన్‌కార్డుల జారీని పకడ్బందీగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక విషయంలో పాత నిబంధనలనే వర్తింపజేయాలని అధికారులకు సూచించింది. అయితే అర్హులైన వారికే ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో దరఖాస్తుల పరిశీలన, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగనుంది. కొత్త రేషన్‌కార్డు లబ్ధిదారుల ఎంపికను ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నారు. ఈ నెల 26 నుంచి కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించేలా అధికారులు సన్నద్ధమవుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment