అర్హులందరికీ సంక్షేమ పథకాలు
గద్వాలటౌన్/కేటీదొడ్డి: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేందుకు గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సంతోష్ తెలిపారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 24, 27, 36వ వార్డులలో నిర్వహించిన ప్రజా పాలన వార్డు సభలలో కలెక్టర్ సంతోష్ పాల్గొని మాట్లాడారు. సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ అని.. ప్రజలు ఎలాంటి అపోహలు, ఆందోళనకు గురికావద్దని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉంటుందన్నారు. నాలుగు పథకాలకు ప్రాథమిక జాబితా ప్రకటించామని, ఇందులో పేర్లు లేని వారు తిరిగి దరఖాస్తు చేసుకుంటే పరిశీలిస్తామన్నారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ పథకాల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి అర్హులను ఎంపిక చేసేందుకు వార్డు సభలు నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషినల్ కలెక్టర్ నర్సింగరావు, కమిషనర్ దశరథ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, వార్డు కౌన్సిలర్లు శ్రీనివాసులు, మురళి, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment