బాలకార్మికులతో పనులు చేయిస్తే కఠిన చర్యలు
మల్దకల్: బాలకార్మికులతో హోటల్ యజమానులు, దుకాణదారులు పనులు చేయిస్తే కఠినచర్యలు తప్పవని జిల్లా లేబర్ అధికారి వేణుగోపాల్ సూచించారు. ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బుధవారం మండలంలోని బిజ్వారం గ్రామంలో ఆపరేషన్ స్మైల్ బృందం సభ్యులు కేశవరావు ఆధ్వర్యంలో అధికారులు పంట పొలాలను సందర్శించారు. ఈ సందర్భంగా పంట పొలాల్లో బాలకార్మికులుగా పనిచేస్తున్న బాలబాలికలను గుర్తించి వారిని పాఠశాలలో చేర్పించారు. పాఠశాలలో చదువుతూ మధ్యలో బడిమానేసిన విద్యార్థులను గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. అదే విధంగా హోటల్, దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో బడిమానేసిన 20మంది విద్యార్థులను గుర్తించి బడిలో చేర్పించారు. కార్యక్రమంలో చైల్డ్‌లైన్ సిబ్బంది ప్రకాష్, వేణు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment