![పథకాలపై అవగాహన పెంచుకోవాలి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10gdl182-210147_mr-1739221528-0.jpg.webp?itok=5towlCP7)
పథకాలపై అవగాహన పెంచుకోవాలి
గద్వాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమాభివృద్ధి పథకాలపై సంపూర్ణ అవగాహన చేసుకోవాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో కాన్ఫరెన్స్‌హాలులో నిర్వహించిన ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఇనిస్టిట్యూట్ 139వ స్థాయి–డి శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా భౌగోళిక పరిస్థితులు, నియోజకవర్గాలు, మండలాల్లో అమలవుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు గురించి క్షేత్రస్థాయిలో పర్యటించి అవగాహన చేసుకోవాలన్నారు. ప్రధానంగా ప్రజల అవసరాలను అనుసరించి పాలసీ మార్పులు చేయడంతో పాటు, పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అధికారులంతా ఈనెల 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నిర్ధేశించిన షెడ్యూల్డ్ ప్రకారం పనిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ రమేష్‌బాబు, ఏడీఆర్‌డీవో నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
పోలీస్ గ్రీవెన్స్‌కు ఆరు అర్జీలు
గద్వాల క్రైం: సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు 6 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఇందులో భూ సంబంధ, స్థల అక్రమణ ఫిర్యాదులు అందాయన్నారు. సివిల్ సమస్యలను కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు.
ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
గద్వాల: వివిధ సమస్యలపై కలెక్టరేట్‌వకు వచ్చే ఫిర్యాదులను త్వరిగా పరిష్కరించాలని కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సమావేశం హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు సమస్యలపై 41మంది వినతులు అందజేసినట్లు కలెక్టర్ తెలిపారు. వచ్చిన వాటిని ఆయా శాఖలకు చెందిన అధికారులకు పంపినట్లు వాటిని వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత ఫిర్యాదుదారుడికి అక్‌నాలెడ్డ్‌మెంట్ ద్వారా తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment