![పథకాల అమలుపై కేంద్ర బృందం ఆరా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11gdl502rr-210036_mr-1739302139-0.jpg.webp?itok=lEQRhBaQ)
పథకాల అమలుపై కేంద్ర బృందం ఆరా
మల్దకల్: మండలంలోని శేషంపల్లిలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరును మంగళవారం కేంద్ర అధికారుల బృందం పరిశీలించింది. స్వచ్ఛభారత్, పింఛన్లు, ఇంకుడుగుంతల నిర్మాణం, రైతులకు పంట పెట్టుబడి సాయం వంటి పథకాల అమలుతో చేకూరుతున్న లబ్ధిపై గ్రామస్తులతో కేంద్ర బృందం దీపక్ వర్మ, అమిత్ వర్మ, మహేష్ లాల్, మయాంక్, రంజాన్ పాల్ ఆరా తీశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పేదలకు కేంద్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికీ అవసరమన్నారు. ఈ సందర్భంగా వ్యక్తిగత మరుగుదొడ్డి ఆవశ్యకతపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వారి వెంట ఎంపీడీఓ ఆంజనేయరెడ్డి, ఎంపీఓ రాజశేఖర్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నాగరాణి, టీఏ ఇబ్రహీం ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment