యాసంగిలో పండించిన టమాటాను డిసెంబర్ నుంచి విక్రయించడానికి రైతులు మార్కెట్‌కు తరలిస్తారు. ఇదే సమయంలో ఏపీలోని పత్తికొండ, దేవనకొండ, ఆలూరు, ఆస్పరి, ప్యాపిలి తదితర ప్రాంతాల నుంచి రైతులు టమాటాను అమ్మకానికి తెచ్చారు. దీంతో డిసెంబర్‌లో ఓ మాదిరి ధర లు వచ్చాయి. జనవరిలో ధరలు పూర్తిగా పడిపోయాయి. టమాటా తెంపిన ఖర్చులు కూడా రావ డంలేదని కొందరు రైతులు తోటల్లోనే పారబోశారు. మరికొందరు తోటలను వదిలేశారు. జీవాలకు ఆహారంగా వేస్తున్నారు. ఫిబ్రవరిలో సైతం ధరలు పెద్దగా రాలేదు. ధరలు రాక టమాటా రైతు ఆర్థికంగా నష్టపోతున్నారు. కూలీలు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదని వాపోతున్నారు. ఏటా డిసెంబర్, జనవరి నెలల్లో ధరలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment