![స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11gdl176-210147_mr-1739302138-0.jpg.webp?itok=4pTrtP72)
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం
గద్వాల: జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అధికారులందరూ సన్నద్ధం కావాలని కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులకు ఏర్పాటుచేసిన శిక్షణ తరగతుల్లో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. గతంలో నిర్వహించిన ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని సూ చించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు తప్పనిసరిగా పాటిస్తూ ఎన్నికల నిర్వహణ చేపట్టాలన్నా రు. ఇందుకు రిటర్నింగ్ అఽధికారులు కీలకపాత్ర పో షించాల్సి ఉంటుందని అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీ టీసీ ఎన్నికలను పూర్తి పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ఎన్నికల సిబ్బంది నిబద్దతతో పనిచేయాలన్నారు. నామినేషన్ల నుంచి మొదలుకుని పోలింగ్ వరకు ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నర్సింగ్‌రావు, జెడ్పీ సీఈఓ నాగేంద్రం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment