![కల్యాణం.. కమనీయం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10gdl106-210033_mr-1739221528-0.jpg.webp?itok=7SlUXf8K)
కల్యాణం.. కమనీయం
గద్వాలటౌన్: గద్వాల సంస్థానాధీశుల ఇలవేల్పు భూలక్ష్మీ చెన్నకేశవస్వామి కల్యాణం కనులపండుగగా నిర్వహించారు. సోమవారం రాత్రి గద్వాల కోటలోని చెన్నకేశవస్వామి ఆలయంలో ముందుగా దేవతామూర్తులను పూజించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు మంత్రాలయ రాఘవేంద్రస్వామి ఆలయ విద్యా పీఠానికి చెందిన పండితుడు వెంకటేశచార్యల బృందం సాంప్రదాయబద్దంగా కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే సతీమణి జ్యోతి స్వామి పట్టువస్త్రాలు సమర్పించారు. కల్యాణోత్సవాన్ని తిలకించడానికి పట్టణానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఔత్సాహిక గాయకులు పాటలు పాడి ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఆలయ విచారణకర్త ప్రభాకర్, మేనేజర్ స్వామిరాయ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment